Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు చెప్పినా పట్టించుకోలేదు... అందుకే ఆ పనిచేశాం... ట్రంప్

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (22:05 IST)
భారత వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తామని పేర్కొన్న కొద్ది గంటలు కూడా గడవక ముందే ట్రంప్ మరో బాంబు పేల్చారు. సుంకాలు లేకుండా భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్తువుల విషయంలో వేటు వేసారు. అమెరికాకి వస్తువులను ఎగుమతి చేసే దేశాలలో భారత్ కూడా ఒకటి. కానీ మేము భారత్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వాణిజ్య హోదాను తొలగించాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. 
 
రాబోయే రోజుల్లో భారత్ అమెరికాకి సుంకాలు లేకుండా వస్తువులను ఎగుమతి చేయడం కుదరదని తేల్చి చెప్పేశారు. దీనికి కారణం కూడా చెప్పారు. అమెరికా మార్కెట్లలో భారత్‌కు కొన్ని వెసులుబాట్లు కల్పించాం. అదేవిధంగా భారత మార్కెట్లలోనూ అమెరికాకు అలాంటి సదుపాయాలు కల్పించాలని కోరాం, కానీ భారత్ స్పందించలేదు. 
 
ఇదే విషయాన్ని ట్రంప్ యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులకు లేఖ ద్వారా తెలియజేశారు. అయితే భారత్ కూడా ట్రంప్ వ్యాఖ్యలకు స్పందించింది. భారత్‌ డబ్ల్యూటీవో మార్గదర్శకాలకు అనుగుణంగానే దిగుమతి సుంకాలు ఉన్నాయని తెలిపింది. ట్రంప్ ఇలాంటి చర్య చేస్తే భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు గండిపడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల భారత్‌కి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. అయితే అమెరికా భారత్‌తో పాటు టర్కీకి కూడా ఈ హోదాని తీసివేసే ఉద్దేశంలో ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments