Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ పాకిస్తాన్ పిల్లిమొగ్గలు... బుద్ధి చెప్పిన భారత్...

మళ్లీ పాకిస్తాన్ పిల్లిమొగ్గలు... బుద్ధి చెప్పిన భారత్...
, మంగళవారం, 5 మార్చి 2019 (17:14 IST)
భారత్ పాకిస్తాన్‌ల మధ్య శాంతి నెలకొందని మనమనుకుంటున్న సందర్భంలో, పాకిస్తాన్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. భారత్‌ను ఏదోవిధంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. సైనిక స్థావరాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాజస్థాన్ సరిహద్దులో భారత గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్ ప్రవేశించింది. 
 
బీఎస్ఎఫ్ దళాలు దానిని పసిగట్టి వెంటనే కుప్పకూల్చాయి. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంతో పాకిస్తాన్ UAV (మానవరహిత వాయు వాహనం)ని కూల్చినట్లు ఎఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది. బీకనేర్ నాల్ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రం దీనిని సమర్థించుకోవాలనుకుంటోంది. బుకాయింపులు మొదలుపెట్టింది. 
 
పాకిస్తాన్‌కి చెందిన జిల్లాలోకి భారత జలాంతర్గామి ప్రవేశించిందని, దానిని మేము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పింది. దీనికి సంబంధించి వీడియోని కూడా రిలీజ్ చేసింది. అయితే భారత నేవీ వర్గాలు మాత్రం వీడియో ప్రామాణీకతను నిర్ధారిస్తున్నామని, కానీ ఇది పాత వీడియో అనిపిస్తోందని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివమెత్తిన విరాట్ కోహ్లీ... 40వ సెంచరీ : ఆస్ట్రేలియా టార్గెట్ 251