దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, పాక్ మీడియా మాత్రం ఈ వార్తలను ఖండించింది. అజర్ మృతిపై ఆయన కుటుంబానికి సన్నిహితులైన వారిని వివరణ కోరగా మసూద్ బతికే ఉన్నాడని చెప్పినట్లు జియో ఉర్దూ న్యూస్ వెల్లడించింది. అయితే అజర్ మృతి చెందాడా? లేక బతికే ఉన్నాడా? అనే విషయంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. అజర్ మృతిపై ఫెడరల్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఫవాద్ చౌదరిని పీటీఐ వివరణ కోరగా.. ఈ విషయంపై తనకేం తెలియదని చెప్పి సమాధానం దాటవేశారు.
మరోవైపు, అజర్ మరణ వార్తలు నిజమా కాదా అని తెలుసుకునేందుకు భారత నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మసూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.