Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాపిటల్‌ భవనంలో ట్రంప్‌ మద్దతుదారుల కాల్పులు..ఒకరు మృతి

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (10:56 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరాజయం పాలైనా తన పీఠాన్ని వదిలేందుకు మంకు పట్టుపడుతున్నారు. ఆ పీఠాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగబడుతున్నారు. ఆయన మద్దతుదారులు కూడా ఆయన్నే అనుసరిస్తున్నారు.

క్యాపిటల్‌ భవనంలో ట్రంప్‌ మద్దతుదారులు కాల్పులు జరపడంతో ఓ మహిళ మృతి చెందారు. ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైనా జో బైడెన్‌ గెలుపును అధికారికంగా ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్‌ బుధవారం సమావేశమైంది.

ఈ సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ..ఈ ఎన్నిక చెల్లదంటూ క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చి కాల్పులు జరపడంతో ..ఆమె భుజానికి బుల్లెట్‌ దూసుకెళ్లగా..చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారని వార్తా సంస్థ వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది.
 
 బైడెన్‌ గెలుపు చెల్లదని, ఈ ఎన్నికలు రద్దు చేయాంటూ ట్రంప్‌ మద్దతు దారులు పెద్ద యెత్తున నినాదాలు చేశారు. బారికేడ్లను దాటి.. కాంగ్రెస్‌లోకి దూసుకువచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకోగా..ఒక మహిళ మృతి చెందారు.

అయితే ట్రంప్‌ మద్దతు దారులను భద్రతా బలగాలు, పోలీసులు నియంత్రించారు. కాగా, ఈ ఘటనను కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ఇది తిరుగుబాటు చర్యగా అభివర్ణించిన ఆయన..ఈ హింసాత్మక చర్యలు చల్లారాలంటే ట్రంప్‌ మీడియా సమావేశంలో మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.

అయితే ఇదంతా ట్రంప్‌ కుట్రలో భాగమని రాజకీయ పండితుల విశ్లేషణ. జో బైడెన్‌ను అధ్యక్షునిగా ధ్రువీకరించే ప్రక్రియను అడ్డుకోవాలని సెనేటర్లకు ట్రంప్‌ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments