Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో కరోనాతో ఎంత మంది మృతి చెందరో తెలుసా?

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (10:49 IST)
గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ సోకి 222 మంది చనిపోయారు. అలాగే, కొత్తగా దేశంలో గత 24 గంటల్లో 20,346 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 19,587 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,95,278కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 222 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,50,336కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  1,00,16,859 మంది కోలుకున్నారు. 2,28,083 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,84,00,995 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,37,590 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 379 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 305 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,789కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,82,177 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,559కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,053 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,776 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments