Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా యువతి తమిళంలో మాట్లాడి అదరగొట్టేసింది.. చైనా వాల్ గురించి?

చైనీయులు తమ భాషకే ప్రాధాన్యత ఇస్తారు. ఇంటర్నెట్ కూడా వారి భాషలోనే వుంటుంది. అందుకే ఐటీలో వారు వెనకబడ్డారని నిపుణులు అంటుంటారు. అయితే ప్రస్తుతం సీన్ మారింది. విదేశీ భాషలపై పట్టు సాధించేస్తున్నారు. అందు

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:54 IST)
చైనీయులు తమ భాషకే ప్రాధాన్యత ఇస్తారు. ఇంటర్నెట్ కూడా వారి భాషలోనే వుంటుంది. అందుకే ఐటీలో వారు వెనకబడ్డారని నిపుణులు అంటుంటారు. అయితే ప్రస్తుతం సీన్ మారింది. విదేశీ భాషలపై పట్టు సాధించేస్తున్నారు. అందుకు ఈ రిపోర్టింగ్ ఉదాహరణ. వివరాల్లోకి వెళితే.. మోనికా అనే చైనా యువతి తమిళంలో మాట్లాడి అదరగొట్టేసింది. 
 
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి తమిళంలో వివరించింది. చాలా స్పష్టంగా ఎక్కడా తేడా రాకుండా.. అనర్గళంగా 3 నిమిషాలు వివరిస్తూ ఉంటుంది. మధ్యలో గోడ, దాని వెనక ఉన్న కొండ క్లియర్‌గా చెప్పింది. టూరిజం గైడ్‌లో భాగంగా ఈ వీడియో చిత్రీకరించారు. ఈ చైనా యువతి, తమిళ భాషలో వివరించిన విధానానికి తమిళులు ఫిదా అయిపోయారు.
 
మాతృభాషలో కాకుండా ఇతర భాషలో ఇంత స్పష్టంగా వివరించటం అంతా ఈజీ కాదంటూ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా ఈ వీడియో షేర్ చేశారు. అంతేగాకుండా గ్రేట్ వాల్ ఆఫ్ తమిళ్ అంటూ కీర్తించటంతో.. తమిళుల ఆనందానికి అవదుల్లేవు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments