Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెరైటీ జంట.. లింగ మార్పిడి చేయించుకుని పెళ్లి చేసుకున్నారు.. ఎక్కడ?

ఇదో విచిత్రమైన కథ. సమాజాన్ని ఎదిరించిన ఓ జంట కథ. ప్రపంచంలోనే అరుదైన ఓ వింత కథ. లింగ మార్పిడి చేసుకుని జీవించే వారి గురించి చదివాం. కానీ ఇక్కడ మాత్రం ఆమె, అతను ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నవారే. ఆ తరువాత వాళ్లిద్దరూ పెళ్ళి కూడా చేసుకున్నారు. తమిళన

Advertiesment
The two transgenders got married in Tamil Nadu
, బుధవారం, 1 ఆగస్టు 2018 (11:55 IST)
ఇదో విచిత్రమైన కథ. సమాజాన్ని ఎదిరించిన ఓ జంట కథ. ప్రపంచంలోనే అరుదైన ఓ వింత కథ. లింగ మార్పిడి చేసుకుని జీవించే వారి గురించి చదివాం. కానీ ఇక్కడ మాత్రం ఆమె, అతను ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నవారే. ఆ తరువాత వాళ్లిద్దరూ పెళ్ళి కూడా చేసుకున్నారు. తమిళనాడులో జరిగిన వింత ఇది.
 
ప్రీతిషా అనే వ్యక్తి 1988లో తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా కళ్యాణిపురంలో జన్మించాడు. కానీ పుట్టుకతో అబ్బాయే అయినా అతను మాత్రం తాను అమ్మాయినే అనుకునేవాడు. అమ్మాయిగానే జీవించాలనుకునేవాడు ప్రతీష్‌. చివరకు 17 యేళ్ళ వయస్సులో లింగ మార్పిడి ద్వారా అమ్మాయిగా మారిపోయి ప్రీతిషా అని పేరు మార్చుకున్నాడు.
 
స్కూలుకు వెళ్ళే టైంలో స్టేజీ డ్రామాలు వేయడమంటే ఆమెకు ఆసక్తి ఉండేది. ప్రస్తుతం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, ట్రైనర్ కూడా. 2004-2005 సంవత్సరం మధ్యలో పాండిచ్చేరి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ సుధా అనే ట్రాన్స్‌జెండర్‌ను కలిశారు. ఆ తరువాత తమిళనాడుకు చెందిన పలువురు ట్రాన్స్‌జెండర్స్ గురించి తెలుసుకున్నారు. వాళ్ళంతా మహారాష్ట్రలోని పుణేలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే ట్రాన్స్‌జెండర్లలో ఎక్కువమంది భిక్షాటన లేదంటే వ్యభిచారం చేసేవారు. ఆ పనులు చేయాలని అనిపించలేదు.
 
స్నేహితురాలి సలహాతో రైళ్ళలో కీచైన్లు, మొబైల్ ఫోన్లు అమ్మడం ప్రారంభించారు. చాలామంది అది ఆపడం మానేయాలని సూచించారు. నగరంలో సిటీ రైళ్ళలో విక్రయాలను నిలిపివేయడంతో సొంతంగా ప్రీతిషా ఒక దుకాణాన్ని పెట్టుకున్నారు. ఇదిలావుంటే 1991లో ఈరోడ్‌లో జన్మించిన ప్రేమ కుమారి అనే అమ్మాయి తాను మగవాడినని అనుకునేది. అమ్మాయిలా జీవించలేకపోయింది. లింగ మార్పిడి చేయించుకుని ప్రేమ్ కుమార్‌గా మారిపోయాడు. ఆ తరవాత వీరిద్దరూ ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. 
 
సమాజం ద్వారా ఇద్దరూ ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మనమిద్దరం కలిసి ఎందుకు వివాహం చేసుకోకూడదని అనుకున్నారు. దీంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సమాజంలో ఇద్దరూ తలెత్తుకుని జీవిస్తున్నారు. ఎవరూ ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్న కోల్పోకూడదని చెబుతున్నారు ప్రీతిషా, ప్రేమ్ కుమార్‌లు. మరి లింగ మార్పిడి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందన్నది కొందరు వేస్తున్న ప్రశ్నలు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కడపలో కత్తితో యువతి హల్‌చల్.. ఎవరిని బెదిరించిందో తెలిస్తే షాకే...