Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాభారత యుద్ధం నాటి రథం, కత్తులు, సమాధులు బయటపడ్డాయ్.. ఎక్కడంటే?

అలనాటి హస్తినాపురికి సమీపంలోని సనౌలీ అనే గ్రామంలో మహాభారతం కాలం నాటి వస్తువులను పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. భారత పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో మహాభారతకాలంనాటి (క్రీ.పూ.2000-1800) రథాలు,

మహాభారత యుద్ధం నాటి రథం, కత్తులు, సమాధులు బయటపడ్డాయ్.. ఎక్కడంటే?
, మంగళవారం, 31 జులై 2018 (17:42 IST)
మహాభారత యుద్ధం మొత్తం 18 రోజుల పాటు జరిగింది. ఈ యుద్ధం పగటి పూట మాత్రమే జరిగింది. ఈ యుద్ధంలో రోజువారీ పోరులో విజేతలెవరో, విజితులెవరో నిర్ణయించేది ఆక్రమించుకున్న భూభాగాలు కానేకావు. మృత కళేబరాల సంఖ్య మాత్రమే. మరణం సంభవించేదాకా జరిగే ఈ రణంలో జీవించి ఉన్నవాడినే విజేతగా నిర్ణయించారు.


మహాభారత యుద్ధంలో భారీగా ప్రాణనష్టం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి మహాభారత కాలం నాటి కత్తులు, ఎముకలు, సమాధులు, రథం ప్రస్తుతం వెలుగులోకి వస్తాయి. 
 
అలనాటి హస్తినాపురికి సమీపంలోని సనౌలీ అనే గ్రామంలో మహాభారతం కాలం నాటి వస్తువులను పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. భారత పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో మహాభారతకాలంనాటి (క్రీ.పూ.2000-1800) రథాలు, కత్తులు, సమాధులు, శవపేటికలు, అస్థికలు.. బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని సనౌలీలో ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జూన్‌లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఈ అవశేషాలను ఎర్రకోటకు తరలించారు. ఇలా పురావస్తు శాఖ తవ్వకాల్లో ఓ రథం బయటపడటం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. 
 
గతంలో గ్రీసు, మెసొపొటేమియాల్లో మాత్రమే ఇలా రథాలు బయటపడ్డాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతేకాదు.. నాలుగు వేల ఏళ్లనాటి.. రాగి పిడి కలిగిన కత్తులను కనుగొనడం కూడా ఇదే తొలిసారి. ఇక సమాధుల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది సమాధులను కనుగొన్నారు. 
 
మరణానంతరం తినడానికన్నట్టు కొన్ని ఆహారపదార్థాలు, దువ్వెనలు, అద్దాలు, బంగారు పూసలు కూడా ఆయా సమాధుల్లో ఉన్నాయి. కాగా, ఈ సమాధుల్లో లభ్యమైన ఎముకలను, దంతాలను డీఎన్‌ఏ పరీక్షలకు.. కత్తులు, ఇతర పరికరాలను మెటలర్జికల్‌ పరీక్షలకు పంపుతున్నట్టు శాస్త్రజ్ఞులు వివరించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార తిరగేసిన మెగాస్టార్ చిరంజీవి... 'సైరా' తమ్ముడు అంటూ పవన్‌కు సవాల్