యుద్ధంలో ఓడిపోతాం.. కానీ అణు యుద్ధం తప్పదు : ఇమ్రాన్ ఖాన్ (video)

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (09:06 IST)
భారత్‌తో సంప్రదాయ యుద్ధమంటూ జరిగితే ఓడిపోవడం ఖాయమనీ, కానీ అణు యుద్ధం తప్పదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఇందులో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న రెండు దేశాల మధ్య సంప్రదాయ యుద్ధం మొదలైనప్పుడు.. చివరికి అది అణుయుద్ధంతో ముగుస్తుందన్నారు. ఇమ్రాన్ ఓవైపు అణు యుద్ధ వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపు తనను తాను శాంతికాముకుడిగా అభివర్ణించుకున్నారు.
 
తాను యుద్ధానికి వ్యతిరేకమని చెబుతూనే, పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని మొదలుపెట్టదని, ఏ సమస్యకూ యుద్ధం పరిష్కారం కాదన్నారు. జమ్ముకాశ్మీర్‌లో శాంతిని కొనసాగించేందుకే తాము సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తాము శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుంటే భారత ప్రభుత్వం తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. 
 
కాగా, ఆర్టికల్ 370 రద్దు అంశంలో భారత్‌ను అంతర్జాతీయంగా బదనాం చేసేందుకు ఎంత ప్రయత్నించినా ప్రపంచ దేశాలు పట్టించుకోకపోవడంతో పాకిస్థాన్ నేతల్లో అసహనం పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా పాక్ ప్రధాని తరుచూ అణుయుద్ధం తప్పదని బీరాలు పలుకుతున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అల్‌జజీరా చానెల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments