వీధుల్లో సింహ రాజులు చక్కర్లు... గజగజ వణికిపోయిన జనాలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (08:59 IST)
గుజరాత్ రాష్ట్రంలో అరుదైనదృశ్యం కంటికి కనిపించింది. ఏడు సింహ రాజుల గుంపు... జనావాసాల్లో చక్కర్లు కొట్టాయి. వీటిని చూసిన స్థానికులు గజగజ వణికిపోయారు. సింహ రాజుల చక్కర్లను ఓవ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ దృశ్యం గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో కనిపించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జునాగఢ్‌లోని గిరినగర్‌ వీధుల్లోకి గత శుక్రవారం రాత్రి ఏడు సింహాలు వచ్చాయి. అవి వీధుల్లో ఇష్టానుసారంగా చక్కర్లు కొట్టాయి. జనావాసాల మధ్య హాయిగా తిరిగాయి. వీటిని చూసిన జనాలు భయంతో వణికిపోయారు. తమ ఇళ్ళకు తలుపులు వేసుకుని బిక్కుబిక్కు మంటూ గడిపారు. 
 
అయితే, ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మధ్యమాల్లో పోస్ట్‌చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, సింహాలను అడవిలోకిపంపించారు. 
 
కాగా, ఈ విషయమై జునాగఢ్‌ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌(డీసీఎఫ్‌) ఎస్కే బేర్వాల్‌ మాట్లాడుతూ.. గిర్‌ అభయారణ్యం సమీపంలోనే ఉండటంతో ఈ సింహాల గుంపు జనావాసాల మధ్యకు వచ్చిందని, వర్షాలు పడినా, పడకున్నా సింహాలు అలా స్వేచ్ఛగా తిరుగుతాయనీ, అది వాటి స్వభావమని వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments