పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అదే భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు భారత దౌత్య కార్యాలయ అధికారులకు అవకాశం ఇవ్వబోమని తేల్చేసింది. ఈ మేరకు పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ సెప్టెంబర్ 2న కుల్‌భూషణ్‌ను కలిసేందుకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ జైలులో వున్న జాదవ్‌తో భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా సెప్టెంబర్ రెండో తేదీన గంట పాటు సమావేశం అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు.
గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2016, మార్చి 3న జాదవ్‌ను బలూచిస్తాన్‌లో పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే.