Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లోరిడాలో తొలి గిటార్ ఆకృతి హోటల్

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (10:38 IST)
అద్భుత ఇంజనీరింగ్‌ సృజనాత్మకత ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలకు ప్రాణంపోసింది. అలాంటి మరో నిర్మాణానికి జీవం పోశారు ఇంజనీర్లు. 450 అడుగుల ఎత్తుతో గిటార్‌ రూపంలో భారీ హోటల్‌ను నిర్మించారు.

ప్రపంచంలో గిటార్‌ ఆకృతిలో నిర్మించిన మొట్టమొదటి ఈ హోటల్‌ ను గిటార్‌ హోటల్‌గా పిలుస్తున్నారు. ఈ భవనం ఇటివలే అందుబాటులోకి రావడంతో అతిథులకు ఆహ్వానం పలుకుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ హోటల్‌ ఉంది.

ఈ హోటల్‌ నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. సెమినోల్‌ హార్డ్‌ రాక్‌ హోటల్‌ అండ్‌ కెసినో, హాలీవుడ్‌ ఈ హోటల్‌ను నిర్మించింది. ఈ హోటల్‌ ప్రారంభం సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సెమినోల్‌ హార్డ్‌ రాక్‌ తన సంతోషాన్ని పంచుకుంది.

హార్డ్‌ రాక్‌ కుటుంబానికి చాలా గొప్పరోజు. గిటార్‌ హోటల్‌ను అధికారికంగా ప్రారంభించామంటూ సంతోషాన్ని పంచుకుంది. ఇదిలావుండగా అద్భుత ఇంజనీరింగ్‌ మాస్టర్‌ పీస్‌కు ప్రతిరూపమైన ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా వారెవ్వా.. అనాల్సిందే.

ఫోర్ట్‌ లాండెర్‌డేల్‌-హాలీవుడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాల్లో ప్రయాణించేవారు ఈ హోటల్‌ను వీక్షించవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments