Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి కరోనా వ్యాక్సిన్‌ సిద్ధం.. తొలి దేశంగా రష్యా రికార్డు

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (08:43 IST)
ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ సిద్ధమైంది. ఈ మేరకు రష్యా చరిత్ర సృష్టించింది. ఈ వ్యాక్సిన్‌ను ఈ నెల 12న రిజిష్టర్‌ చేయనున్నట్లు రష్యన్‌ ఆరోగ్య శాఖ ఉప మంత్రి అలెగ్‌ గ్రిడ్నేవ్‌ ప్రకటించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఆరోగ్య కార్యకర్తలకు, చిన్నారులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం చివరిది అయిన మూడో దశ కొనసాగుతోందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ సురక్షితంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఫార్ములాపై క్లినికల్‌ ట్రయల్స్‌ మాస్కోలోని షెచెనోవ్‌ యూనివర్సిటీలో జూన్‌ 18న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ అధ్యయనంలో 38 మంది వాలంటీర్లు పాలుపంచుకున్నారు. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను అన్నిటిని ఇది పూర్తి చేసింది.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు గత వారం ఆరోగ్యశాఖ సీనియర్‌ మంత్రి మైఖెల్‌ మురాస్కో ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments