Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ తో వాణిజ్యసంబంధాలు రద్దు: పాక్ సంచలన నిర్ణయం

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (07:50 IST)
జమ్ముకశ్మీర్ విభజన బిల్లు ఉభయసభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రత కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. 
 
జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దులపై చర్చించారు. జమ్ముకశ్మీర్ పై భారత్ నిర్ణయాన్ని సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. 
 
ఇకపై భారత్ తో ఉన్న వాణిజ్య సంబంధాలు రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే భారత్ తో ఉన్న దౌత్య సంబంధాలు సైతం తగ్గించుకోవాలని సూచించారు. భారత్ తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను మరోసారి పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments