Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానపద గాయకుడు ఫవాద్ అందరాబీని హత్య చేసిన తాలిబన్లు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (07:06 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్ తీవ్రవాదులు.. రోజురోజుకూ తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని, ఒకప్పుడు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినవారిని ఒక్కొక్కరిని గుర్తించి, పట్టుకుని మరీ హతమార్చుతున్నారు. 
 
తాజాగా ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్‌ అందరాబీని హత్య చేశారు. ఆయన పేరుపై ఉన్న అందరాబీ పర్వత ప్రాంతంలోనే శుక్రవారం ఫవాద్‌ను హత్య చేసినట్లు గాయకుడి కుటుంబీకులు వెల్లడించారు. తిరుగుబాటుదారులే ఈ హత్య చేసి ఉంటారని తాలిబన్లు పేర్కొనడం గమనార్హం.
 
మరోవైపు, తండ్రి మృతిపట్ల ఫవాద్‌ కుమారుడు జవాద్‌ అందరాబీ ఆవేదన వ్యక్తం చేశాడు. 'కొద్దిరోజుల క్రితమే కొందరు తాలిబన్లు మా ఇంటికి వచ్చి నాన్నతో కలిసి టీ తాగారు. కానీ ఏమైందో ఏమో ఇంతలోనే మా నాన్నను పొట్టన పెట్టుకున్నారు' అంటూ జవాద్‌ వాపోయాడు. 
 
తన తండ్రి హత్యపై న్యాయం కోరుతూ స్థానిక తాలిబాన్ కౌన్సిల్‌ను ఆశ్రయింగా.. ఫవాద్‌ మృతికి కారణమైనవారిని గుర్తించి శిక్షిస్తామని వారు హామీ ఇచ్చారని జవాద్‌ తెలిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించి ఇందుకు కారకులైన తిరుగుబాటుదారులను శిక్షిస్తామని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments