Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో బాంబు బెదిరింపు... కారణం తెలిస్తే షాక్ అవుతారు

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (12:37 IST)
విద్య పేరుతోనో, ఉద్యోగం పేరుతోనో ఇప్పుడు బయటి ఊరిలో ఒంటరిగా రూముల్లో లేదా హాస్టల్‌లలో ఉండే యువత ఎక్కువగా ఉన్నారు. తల్లిదండ్రులు ఏదైనా పని మీద వస్తున్నారంటే ఇక వారు పడే ఆందోళన అంతా ఇంతా కాదు. కొందరు కుంటిసాకులు చెప్పి రాకుండా చేస్తే, మరికొందరు తగిన ఏర్పాట్లతో తప్పించుకుంటారు. కానీ ఫ్రాన్స్‌లో ఒక కుర్రాడు చేసిన పని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. 
 
జనవరి 18న ఫ్రాన్స్‌లో లియోన్ నుంచి రెన్నెస్‌కు వస్తున్న EZY4319 విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆ విమానాన్ని తిరిగి లియోన్‌ విమానాశ్రయంలోనే ల్యాండ్ చేసి, తనిఖీలు చేసారు. కాగా విమానంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్న సిబ్బంది కాల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు చేసారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.
 
రెన్నెస్‌లో ఉంటున్న 23 ఏళ్ల విద్యార్థి ఆ కాల్ చేసినట్లు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిదండ్రులు తనను కలవడానికి ఆ విమానంలో బయలుదేరినట్లు, వారు రావడం ఇష్టం లేక ఆ బెదిరింపు కాల్ చేసానని అతడు తెలిపాడు. విచారణలో ఉన్న ఈ కేసు తేలితే అతనికి భారీ మొత్తంలో జరిమానాతో పాటుగా ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడమంటే ఇదే మరి!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments