Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలిక శీలాన్ని చిదిమేశాడు... కామాంధుడుకి బాసటగా పోలీసులు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (12:35 IST)
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ళ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కామాంధుడుని అరెస్టు చేయాల్సిన పోలీసులు.. కామాంధుడుకి అండగా నిలబడ్డారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లాలోని రెంటచింతల మండలం తుమ్మర్‌కోట గ్రామంలో మిర్యాల జయరాం అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై జయరాం కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను అక్కడే వదిలివేసి నిందితుడు పారిపోయాడు. బాలికను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ విషయం పోలీసులకు చేరవేశారు. అయితే, పోలీసులు మాత్రం తాస్కారం చేస్తూ బాధితుడుని అరెస్టు చేయకుండా మిన్నకుండిపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మాచర్ల పోలీస్ స్టేషన్ ముందు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. 
 
దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని బాధిత కుటుంబానికి, గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శాంతించారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments