నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కన్నకూతురిపై తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామాంధుడు అటవీశాఖలో ఉద్యోగి.
కావలి సమీపంలోని పాతూరుకు చెందిన అటవీశాఖ ఉద్యోగి భాస్కర్‌కి 13యేళ్ళ కుమార్తె ఉంది. తల్లి సుప్రజ వారంరోజుల కిందట తన సొంత ఊరు తిరుపతికి వెళ్ళింది. ఇంట్లో కుమార్తె ఒక్కటే ఉండటంతో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండురోజుల పాటు ఆమెను శారీరకంగా అనుభవించాడు.
విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. తల్లి సుప్రజ ఇంటికి వచ్చినాసరే విషయాన్ని బయటకు చెప్పలేదు కుమార్తె. తెల్లవారుజామున బాధతో ఏడుస్తూ ఇంటి ముందు కూర్చున్న కుమార్తెను ప్రశ్నించింది తల్లి. దీంతో అసలు విషయం బయటపడింది. స్థానికంగా ఉన్న పోలీస్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది భార్య. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.