Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వలియమ్మ పెళ్లి సక్రమంకాదు.. కానీ, బిడ్డకు తండ్రి ఆస్తిలో వాటా : సుప్రీంకోర్టు

Advertiesment
Muslim-Hindu Couple
, గురువారం, 24 జనవరి 2019 (09:27 IST)
కేరళకు చెందిన ఓ వలియమ్మ అనే హిందూ మహిళ... మహ్మద్ ఇలియాస్ అనే ముస్లింను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి సక్రమంకాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే, వీరిద్దరికి పుట్టిన బిడ్డకు మాత్రం తండ్రి ఆస్తిలో వాటాకోరే హక్కు ఉందని చెప్పింది. అదేసమయంలో భార్యగా భర్త నుంచి భరణం కోరవచ్చుగానీ, ఆస్తిలో వాటాకోరే హక్కు వలియమ్మకు లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 
 
వలియమ్మ - మహ్మద్ ఇలియాస్‌లు మతాంతర వివాహం చేసుకున్నారు. వీరికి శంషుద్దీన్ అనే బిడ్డ జన్మించాడు. శంషుద్దీన్‌కు తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేందుకు చిన్నాన్న, పెదనాన్న కుమారులు వాదించారు. దీంతో శంషుద్దీన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు శంషుద్దీన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 
 
ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎంఎం శాంతను గౌడర్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పును వెలువరించింది. ఒక హిందూ మహిళ, ఒక ముస్లిం పురుషుడి వివాహం సక్రమం కాదని పేర్కొంది. పైగా, ఈ తరహా వివాహం చెల్లుబాటు కాదని తెలిపింది. అలాంటి పెళ్లి కారణంగా భర్త నుంచి భార్యకు భరణం వస్తుందే తప్ప ఆస్తుల్లో వాటా అడిగే హక్కు మాత్రం ఉండదని తేల్చి చెప్పింది. అయితే వారికి పుట్టిన పిల్లలు మాత్రం చట్టబద్దమైన హక్కులన్నీ సంక్రమిస్తాయని, ఆస్తుల్లో హక్కు కూడా ఉంటుందని తెలిపింది. 
 
"ఇస్లాం చట్ట ప్రకారం ముస్లింల పెళ్లి కేవలం ఒప్పందం మాత్రమే. మూడు రకాల పెళ్లిళ్లు ఉంటాయి. సరైన, సక్రమంకాని, న్యాయబద్ధంకాని అనే పెళ్లిళ్లు ఉంటాయి. న్యాయబద్ధంకాని పెళ్లితో దంపతులకు పుట్టిన పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండవు. ఇలియాస్‌, వలియమ్మలది కూడా సక్రమంకాని పెళ్లి. అయినా పిల్లలకు చట్టబద్ధమైన హక్కులన్నీ వస్తాయి. కేరళ హైకోర్టు కూడా ఈ సిద్ధాంతాల ఆధారంగానే తీర్పునిచ్చింది. వలియమ్మ ముస్లిం కాకపోయినా, శంషుద్దీన్‌‌‌‌కు తన తండ్రి ఇలియాస్‌ వారసత్వం దక్కుతుంది. ఆస్తుల్లో వాటా కూడా వస్తుంది. కాబట్టి హైకోర్టు, కింది కోర్టులు ఈ విషయంలో సరిగ్గానే తీర్పునిచ్చాయి" అని అపెక్స్ కోర్టు స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పియూష్ గోయల్...