Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేడీయో గేలాక్సీని గుర్తించిన ఇండియన్ టెలిస్కోప్

భారతీయ టెలిస్కోప్ అంతరిక్షంలో ఇంతకుముందు ఎప్పుడూ కనుగొనని చాలా దూరంలో ఉండే రేడియో గేలాక్సీని గుర్తించింది. విశ్వం ప్రస్తుత వయస్సులో కేవలం ఏడు శాతం మాత్రమే ఉన్నప్పుడు ఈ గేలాక్సీ పుట్టింది. దీనిని పూణేలో జెయింట్ మీటర్-వేవ్ రేడియో టెలిస్కోప్ (జిఎమ్ఆర్‌ట

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (17:38 IST)
భారతీయ టెలిస్కోప్ అంతరిక్షంలో ఇంతకుముందు ఎప్పుడూ కనుగొనని చాలా దూరంలో ఉండే రేడియో గేలాక్సీని గుర్తించింది. విశ్వం ప్రస్తుత వయస్సులో కేవలం ఏడు శాతం మాత్రమే ఉన్నప్పుడు ఈ గేలాక్సీ పుట్టింది. దీనిని పూణేలో జెయింట్ మీటర్-వేవ్ రేడియో టెలిస్కోప్ (జిఎమ్ఆర్‌టి) సహాయంతో గుర్తించారు. ఈ టెలిస్కోప్‌ని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ నిర్వహిస్తోంది.
 
ఈ గేలాక్సీ దూరాన్ని హవాయిలోని జెమినీ నార్త్ టెలిస్కోప్ మరియు అరిజోనాలోని పెద్ద బైనాకులర్ టెలిస్కోప్ సహాయంతో కనుగొన్నారు. మన విశ్వానికి ఒక బిలియన్ సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ గేలాక్సీ ఎలా ఉండేదో అలా గ్రహించబడిందని రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ వెల్లడించింది. దీనర్థం గేలాక్సీ నుండి వచ్చిన కాంతి సుమారు 12 బిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. ఇంత తక్కువ సమయంలో ఈ గేలాక్సీలు వాటి ద్రవ్యరాశులను ఎలా రూపొందించాయో ఆశ్చర్యం కలుగుతోందని నెథర్‌లాండ్స్‌లోని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన ఆయుష్ సక్సేనా చెప్పారు. 
 
విశ్వం యొక్క చరిత్రలో ఇటువంటి వస్తువులను కనుగొనడం చాలా ఆశ్చర్యంగా ఉందని, ఈ సూపర్ మాసివ్ బ్లాక్‌హోల్‌లు అతి తక్కువ సమయంలో ఏర్పడ్డాయని కూడా చెప్పారు. రేడియో గేలాక్సీలు విశ్వంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అవి చాలా పెద్దవిగా ఉండి పరిసరాల నుండి వాయువులు మరియు ధూళిని చురుకుగా ఆకర్షించే సూపర్‌ మాసివ్ బ్లాక్‌హోల్‌ని కలిగి ఉంటాయి. ఈ చర్య అతిశక్తివంతమైన జెట్ ప్రవాహాలను సృష్టిస్తుంది. దాని వలన బ్లాక్‌హోల్ చుట్టూ కాంతివేగంతో సమానంగా ఛార్జ్డ్ కణాలకు త్వరణం కలుగుతుంది. ఈ ప్రవాహాలను రేడియో తరంగ దైర్ఘ్యంతో చూడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments