Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ వీసా ఆశావహులకు శుభవార్త... వెయింటింగ్ సమయం కుదింపు

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (08:45 IST)
అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనుకునేవారికి ఇది నిజంగానే శుభవార్త. అమెరికా వీసాల కోసం పడిగాపులు కాసే సమయాన్ని బాగా కుదించారు. పలు నగరాల్లో ఈ వెయింటింగ్ సమయాన్ని తగ్గించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. 
 
సాధారణంగా అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. అలా ఎదురుచూస్తున్న భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది. వారాంతంలో 2.5 లక్షల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్మెంట్లను ఓపెన్ చేసినట్టు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. 
 
తమ కాన్సులర్ బృందానికి ఇది బిజీ వారమని తెలిపింది. https://www.ustraveldocs.com/in/en పై అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఫలితంగా నాస్ఇమ్మిగ్రెంట్ వీసాలైన బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) ఇంటర్వ్యూ కోసం వేచి చూసే సమయం భారీగా తగ్గింది.
 
ఈ నిర్ణయం కారణంగా ఢిల్లీలో గతవారం 542 రోజులుగా ఉన్న వెయిటింగ్ టైమ్ ఇప్పుడు 37 రోజులకు తగ్గింది. అలాగే, కోల్‌కతాలో 539 నుంచి 126 రోజులకు తగ్గింది. ముంబైలో 596 నుంచి 322 రోజులకు, చెన్నైలో 526 నుంచి 341 రోజులకు భారీగా తగ్గింది. 
 
కానీ, హైదరాబాద్ నగరంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా కొన్ని రోజులు అదనంగా పెరిగాయి. గతవారం వెయిటింగ్ సమయంలో 506 రోజులు ఉండగా ఇప్పుడది 511 రోజులకు చేరడం గమనార్హం. ఇదిలావుండగా ఈ ఏడాది అమెరికా, భారతీయులకు సంబంధించిన 10 లక్షలకు పైగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. కరోనా ముందు కంటే ఇది 20 శాతం ఎక్కువని ఎంబసీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments