Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ గత చరిత్రను తిరగరాస్తాడా? ఇదే ఆఖరి మ్యాచ్ అవుతుందా?

msdhoni
, సోమవారం, 29 మే 2023 (11:20 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గత చరిత్రను తిరగరాస్తాడా లేదా అన్నది ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని మెదళ్లలో నానుతున్న ప్రశ్న. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వెళ్లింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌ - గుజరాత్ టైటాన్స్‌ జట్ల మధ్య ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్‌ పోరు ఆదివారం జరగాల్సి ఉంది. 
 
అయితే, వర్షం వల్ల సోమవారానికి (నేటికి) మ్యాచ్‌ వాయిదా పడింది. హార్దిక్‌ నాయకత్వంలోని గుజరాత్ వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని భావిస్తుండగా.. ముంబైతో సమంగా ఐదు టైటిళ్లను గెలవాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే, రిజర్వ్‌ డే రోజున జరిగిన మ్యాచ్‌లో ధోనీకి ఎలాంటి ఫలితం వస్తుందోనని సీఎస్‌కే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే, రిజర్వ్‌ డే మ్యాచ్‌ అనగానే 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ గుర్తుకురావడం సహజం. అప్పుడు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వెళ్లింది. న్యూజిలాండ్‌పై ధోనీ (50) హాఫ్‌ సెంచరీ సాధించినా టీమిండియా మాత్రం ఓడిపోయింది. కీలక సమయంలో ధోనీ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. విజయానికి చేరువగా వచ్చి మరీ భారత్ ఓటమిపాలైంది. 
 
ధోనీకి అదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం గమనార్హం. మరుసటి ఏడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. ఆటగాడిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌గా భావిస్తున్న తరుణంలో రిజర్వ్‌ డే మ్యాచ్‌లో విజయం సాధించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇలా జరగాలంటే మ్యాచ్‌ రద్దు కాకుండా కొన్ని ఓవర్లతోనైనా జరగాలి. ఈ క్రమంలో గత చరిత్రను ధోనీ తిరగరాసి ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ రోజు కూడా మ్యాచ్ జరగకపోతే... ఐపీఎల్ టైటిల్ ఎవరికి?