Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లీ జెర్సీని బాబర్ తీసుకుని తప్పు చేశాడు : వసీం అక్రమ్

wasim akram
, ఆదివారం, 15 అక్టోబరు 2023 (11:53 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శనివారం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ జెర్సీని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అడిగి తీసుకున్నారు. తమ బంధువుల పిల్లలు అడిగారని, ఆ జెర్సీ ఇవ్వాలని అజమే కోరగానే విరాట్ కోహ్లీ తన జెర్సీపై సంతకం చేసి ఇచ్చేశాడు. 
 
ఇది టీవీల్లో పదేపదే ప్రసారం చేశారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ వసీం అక్రమ్ స్పందించారు ఓవైపు జట్టు ఓటమితో అభిమానులు బాధపడుతుంటే బాబర్ అలా చేసి ఉండాల్సింది కాదని విమర్శిస్తున్నాడు. జట్టు విఫలమైన సమయంలో చేయాల్సిన పని కాదంటూ బాబర్‌పై మండిపడ్డారు. కోహ్లీని డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసి, జెర్సీ తీసుకుని ఉండాల్సిందని చెప్పారు.
 
శనివారం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో పాక్ జరిగిన మ్యాచ్ భారత్ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ఓటమి భారంతో ఉన్న పాకిస్థాన్‌కు విరాట్ కోహ్లి ఓ బహుమతి ఇచ్చాడు. తను సంతకం చేసిన జెర్సీని పాక్ కెప్టెన్‌కు బహుమతిగా ఇచ్చి తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. 
 
మైదానంలో నువ్వా నేనా అన్నట్టు తలపడే భారత్, పాక్ జట్టుల మధ్య స్నేహశీలతను అద్భుత రీతిలో ప్రదర్శించిన విరాట్ కోహ్లిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ చర్యతో రెండు టీంల మధ్య స్నేహం, పరస్పర గౌరవం వెల్లివిరుస్తాయని క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మైదానంలో ఎలా ఉన్నా బయట మాత్రం తాము పరస్పరం గౌరవించుకుంటామని కోహ్లి చాటిచెప్పినట్లైందని కామెంట్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్డే క్రికెట్‌లో 300 సిక్సర్లు బాదిన హిట్ మ్యాన్.. రోహిత్ రికార్డ్