Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కాల్పుల కలకలం .. ఆరుగురి మృతి

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (10:54 IST)
ప్రపంచంలో తుపాకీ కల్చర్ అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా ఒకటి. కొందరు దుండగులు జరిపే కాల్పుల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఇండియానాలో ఈ కాల్పులు జరిగాయి. 
 
ఓ ఇంట్లో దుండగులు కాల్పులకు పాల్ప‌డ‌డంతో గర్భిణీ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌ అడ‌మ్స్ స్ట్రీల్ 3500 బ్లాక్‌లో జరిగింది. ఈ ఘటనను ఇండియానాపోలిస్ మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు ప్రారంభించార‌ని వివరించారు. 
 
ఇది చాలా దారుణమైన ఘటన అని, దశాబ్ద కాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని అక్క‌డి పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌నలో మ‌రో మైన‌ర్‌కి తీవ్ర‌గాయాలు కాగా ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంద‌ని పోలీసులు వివ‌రించారు. ప్ర‌స్తుతం ఆ మైన‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments