Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీపురుషులే కాదు.. హిజ్రాలు కూడా సమానమే : జో బైడెన్ ఆదేశాలు

స్త్రీపురుషులే కాదు.. హిజ్రాలు కూడా సమానమే : జో బైడెన్ ఆదేశాలు
, సోమవారం, 25 జనవరి 2021 (10:35 IST)
అమెరికా కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ఇప్పటివరకు ఏకంగా 17 ఆదేశాలపై సంతకాలు పెట్టారు. వీటిలో లింగవివక్షత చట్టం ఒకటి. స్త్రీపురుషులతో పాటు.. లింగ మార్పిడి చేయించుకున్న, హిజ్రాలు ఇలా ఎవరైనా సరే అందరూ సమానమేనని, మనమంతా మనుషులమేనని చెప్పారు. అందువల్ల మనుష్యుల మధ్య ఎలాంటి అంతరాలు లేవని స్పష్టం చేశారు. 
 
ఈ ఆదేశాలపై జో బైడెన్ సంతకం చేయగానే ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపించారు. కానీ, ఇపుడు క్రమంగా అసహనం, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. స్త్రీ, పురుషులు, ట్రాన్స్ జెండర్లు సమానమేనని, ఎవరిపైనా వివక్ష చూపించరాదని ఆయన కోరారు. 
 
అధ్యక్ష హోదాలో బైడెన్ తీసుకున్న నిర్ణయానికి తొలుత అభినందనలు వచ్చినప్పటికీ.. ఇపుడు మాత్రం పరిస్థితి మారింది. అనేకమంది ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఉమన్ రన్నర్‌ను ట్రాన్స్ ఉమన్ రన్నర్‌తో పోటీకి దింపితే గెలిచేది ట్రాన్స్ ఉమన్ మాత్రమేనని, వారు బలంగా ఉంటారని, ఇటువంటి నిర్ణయం తిక్క నిర్ణయామని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
 
వాస్తవానికి ఈ ఆర్డర్ గత బుధవారం నాడు పాస్ అయింది. బైడెన్ ఎంతో మంచి అధ్యక్షుడంటూ ట్రాన్స్‌జెండర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన సమ భావనకు ఎవరూ అడ్డు చెప్పడం లేదుకానీ, మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ మహిళలను అనుమతించరాదని, వారు బరిలో ఉంటే, తమకు గుర్తింపు దక్కదని, తామే ఓడిపోతామని మహిళల నుంచి బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. మరి ఈ నిర్ణయంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాలకు స్వస్తి చెప్పిన మాజీ ఎంపీ మురళీ మోహన్