Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్‌కు రాలేదనీ... ఆమె ప్రియుడిని హత్య చేసిన ఎన్.ఆర్.ఐ

తనతో డేటింగ్ చేసేందుకు నిరాకరించిన ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను ప్రవాస భారతీయుడు హత్య చేశాడు. ఈ దారుణం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కెవిన్ ప్రసాద్ (31) అనే ప్రవాస భారతీ

Webdunia
గురువారం, 3 మే 2018 (12:33 IST)
తనతో డేటింగ్ చేసేందుకు నిరాకరించిన ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను ప్రవాస భారతీయుడు హత్య చేశాడు. ఈ దారుణం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కెవిన్ ప్రసాద్ (31) అనే ప్రవాస భారతీయుడు శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ సేవలందిస్తున్నాడు. అదేచోట ఓ యువతి పనిచేస్తోంది. ఈమెను ఎలాగైనా వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రసాద్ పలుమార్లు ఆమెను డేటింగ్‌కు రమ్మని ఆహ్వానించాడు. నగలు, నగదు ఆశచూపి లోబరుచుకోవాలని ప్లాన్ వేశాడు.
 
అయితే, దాన్ని తిరస్కరించిన ఆమె, తనకు దీర్ఘకాలంగా మార్క్ మంగాక్కట్ (31) అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, తమకు మూడేళ్ల బిడ్డ కూడా ఉందని చెప్పి తప్పించుకునేది. ఈ క్రమంలో తలకు ముసుగు ధరించిన ఓ యువకుడు మంగాక్కట్ కారు వద్దకు వచ్చి అతన్ని తుపాకితో కాల్చి చంపాడు. విచారణ ప్రారంభించిన పోలీసులకు తొలుత నిందితుడిని గురించి ఒక్క క్లూ కూడా లభించలేదు. 
 
ఇదేసమయంలో అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన ప్రసాద్ సహోద్యోగినిని విచారిస్తున్న క్రమంలో, పనిచేసేచోట ఓ యువకుడు తనను డేటింగ్‌కు రావాలని ఒత్తిడి చేస్తుండేవాడని ఆమె చెప్పగా, పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. దీంతో ప్రసాద్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడైన డొనోవాన్ మ్యాథ్యూ రివీరా సహాయంతో అతను మంగాక్కట్‌ను హత్య చేశాడని పోలీసులు తేల్చారు. ఈ నేరం రుజువైతే ప్రవాస భారతీయుడికి మరణశిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments