Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్ సేనలు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (10:03 IST)
రష్యాకు చెందిన మరో యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సేనలు కూల్చివేశాయి. గత 11 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సాగిస్తున్న విషయం తెల్సిందే. ఈ యుద్ధాన్ని తక్షణం ఆపాలంటూ ప్రపంచ దేశాలు చేస్తున్న విజ్ఞప్తులను రష్యా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సైతం పట్టుకుని ఈడ్చుకొచ్చి కాల్చిపారేస్తుంది.
 
మరోవైపు, రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ నుంచి 1.5 మిలియన్ల మంద ఇతర దేశాలకు తరలిపోయారు. మరోవైరు, ఉక్రెయిన్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ చేస్తున్న విజ్ఞప్తులను నాటో దేశాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధంతో ఇరు వైపులా భారీ నష్టం వాటిల్లుతుంది. 
 
ఇదిలావుంటే, తమ దేశంపై బాంబులు కురిపించందుకు వచ్చిన రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సేనలు కూల్చివేశాయి. ఖార్కివ్ మీదుగు ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ప్రకటించింది. పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. కులినిచిన్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments