రష్యాలో భారీ పేలుడు - 11 అపార్ట్‌మెంట్ భవనాలు నేలమట్టం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (12:27 IST)
ఉక్రెయిన్‌ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న రష్యా నగరం బెల్‌గోరోడ్‌లో ఆదివారం భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు మొత్తం 11 అపార్ట్‌మెంట్‌ భవనాలు, 39 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిని ఆ ప్రాంత గవర్నర్‌ గ్లాడికోవ్‌ ధ్రువీకరించారు. 
 
ఈ పేలుళ్ల కారణంగా ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిపై ఉక్రెయిన్‌ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత నుంచి తరచూ ఈ విధంగా రష్యాలో ఏదో ఒక ప్రాంతంలో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కీలకమైన మౌలిక వ్యవస్థలున్న ప్రదేశాల్లో ఇవి చోటుచేసుకోవడం గమనార్హం. 
 
ఉక్రెయిన్‌కు చెందిన స్పెషల్‌ కమాండో బృందాలు రహస్యంగా రష్యాలోకి చొరబడి కీలక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని ఇటీవల ది టైమ్స్‌ పత్రిక కథనంలో పేర్కొంది. అత్యున్నత శ్రేణి శిక్షణ పొందిన షామన్‌ రహస్య దళాలు రష్యా కీలక ప్రదేశాలను ధ్వంసం చేయడంపై దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. 
 
ముఖ్యంగా ఉక్రెయిన్‌ దాడికి వినియోగిస్తోన్న ఆయుధాలు, నిర్మాణాలను గుర్తించి ధ్వంసం చేయడం ఈ బెటాలియన్‌ పని.  ఇప్పటి వరకు ఈ దళాలు రష్యా చమురు , ఆయుధ డిపోలు, కమ్యూనికేషన్‌ పరికరాలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments