Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీటరు నీటితో అతిపెద్ద బాంబును నిర్వీర్యం చేసిన ఉక్రెయిన్ నిపుణుడు

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (07:45 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య గత 16 రోజులుగా యుద్ధం సాగుతోంది. చిన్న దేశమైన ఉక్రెయిన్‍‌పై రష్యా సేనలు దండయాత్రను చేపట్టాయి. ప్రపంచ దేశాల ఆంక్షలను సైతం ఉల్లంఘించిన ఈ దాడులుచేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‍‌లోని అనేక కీలక నగరాలను రష్యా సైనికులు ధ్వంసం చేశారు. అయితే, ఉక్రెయిన్‌పై ప్రయోగించేందుకు రష్యా సిద్ధంగా ఉంచిన అతిపెద్ద బాంబును ఉక్రెయిన్ నిపుణుడు ఒకరు లీటరు మంచినీటితో నిర్వీర్యం చేశాడు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి ఈ బాంబు పేలివుంటే ఉక్రెయిన్‌లో అపారమైన నష్టం వాటిల్లేది. అనేక భవనాలు క్షణాల్లో నేలమట్టమైవుండేవి. అయితే, ఉక్రెయిన్ బాంబు స్క్వాడ్‌కు చెందిన నిపుణుడు ఒకరు ధైర్యంగా ముందుకు వచ్చి ఎలాంటి పరికరాలు లేకుండానే కేవలం లీటరు నీటితో దాన్ని నిర్వీర్యం చేశాడు. 
 
బాటిల్ నీళ్లు తీసుకున్న వ్యక్తి బాంబుపై నీళ్లు పోస్తుంటే, మరొకరు దాని సీలను బయటకు తీసి బాంబు పేలకుండా చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఉక్రెయిన్ ప్రజల ధైర్యసాహసాలకు ఫిదా అయ్యారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments