Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌ను వణికిస్తున్న డెల్టా వేరియంట్ - లాక్డౌన్ పొడగింపు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (11:57 IST)
బ్రిటన్‌ను ఓ కొత్త వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ పేరు డెల్టా వేరియంట్. ఇది ఆందోళన కలిగిస్తుంది. అయితే, ఈ వైరస్‌ రాకుండా ఉండాలంటే రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకుంటే.. ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా వేరియంట్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు అని తాజా అధ్య‌య‌నం తేల్చింది. 
 
రెండు డోసుల టీకా డెల్టాపై అత్యంత ప్ర‌భావంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు ఇంగ్లండ్ ప‌బ్లిక్ హెల్త్ శాఖ చెప్పింది. రెండు డోసులు తీసుకోవ‌డం వ‌ల్ల హాస్పిట‌ల్ అడ్మిష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని తెలిపింది. ఫైజ‌ర్ టీకా రెండు డోసులు తీసుకుంటే.. 96 శాతం కేసుల్లో చికిత్స అవ‌స‌రం రాలేద‌న్నారు. 
 
ఇక ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న‌వారిలో 92 శాతం మంది సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఇంగ్లండ్ ప‌బ్లిక్ హెల్త్ స్ట‌డీ వెల్ల‌డించింది. డెల్టా స్ట్రెయిన్ తొలుత భారత్‌లోనే ఎక్కువ సంఖ్య‌లో విధ్వంసం సృష్టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బ్రిట‌న్ కూడా ఈ డెల్టా వేరియంట్‌తో ఇబ్బందిప‌డుతోంది. 
 
ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ క‌రోనా ఆంక్ష‌ల‌ను జూన్ 21వ తేదీ వ‌ర‌కు పెంచేశారు. ఏప్రిల్ 12 నుంచి జూన్ 4వ తేదీ వ‌ర‌కు 14 వేల కొత్త కేసుల‌ను ఇంగ్లండ్ ప‌రిశీలించింది. యూకే గ‌వ‌ర్న‌మెంట్ లెక్క‌ల ప్ర‌కారం 57 శాతం మంది ప్ర‌జ‌లు రెండు డోసుల టీకాల‌ను తీసుకున్నారు. 
 
మరోవైపు, బ్రిటన్‌లో లాక్డౌన్‌ను వచ్చే నెల 19వ తేదీ వరకు పొడగించారు. ఈ మేరకు బ్రిటిష్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ సోమవారం తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు ఈ నెల 21న ముగియనుంది. దీంతో ఈ లాక్డౌన్ పొడగించారు. 
 
కరోనా డెల్డా వేరియంట్‌ సంక్రమణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎం పేర్కొన్నారు. ఆంక్షలు జూలై 19వ తేదీ వరకు అమలులో ఉంటాయని, ఆ తర్వాత పొడగించాల్సిన అవసరం ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు 40 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్‌ టీకా రెండో మోతాదును వేగవంతం చేస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం బ్రిటన్‌లో కొత్తగా 7,490 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. ఎనిమిది మంది మరణించారు. వారం కిందటి కేసులతో పోలిస్తే గతవారం కేసుల్లో 49శాతం పెరుగుదల కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments