Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా అధినేత పుతిన్‌కు అనారోగ్యం?

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (13:44 IST)
రష్యా దేశ శాశ్వత అధినేతగా ఎంపికైన వ్లాదిమిర్ పుతిన్‌ తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన తన పదవి నుంచి తప్పుకునే సూచనలు ఉన్నట్టు సమాచారం. 
 
68 యేళ్ళ పుతిన్‌కు ప్రస్తుతం మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బతినే పార్కిన్సన్స్ వ్యాధితో ఆయన బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో అధ్యక్ష పదవీ బాధ్యతలను నిర్వర్తించడం మంచిది కాదని ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు ఆయనకు సలహా ఇస్తున్నారు. 
 
అనారోగ్యం బారినపడ్డప్పటికీ, ఆయన తన పని తాను చేస్తున్నారు. అయితే, భవిష్యత్‌లో వ్యాధి మరింత ముదిరే అవకాశం ఉండడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆయనను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన తప్పకుండా రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. 2021 జనవరిలో పుతిన్ రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు రష్యా మీడియా తెలిపింది. మరోవైపు రాజకీయ రంగ విశ్లేషకులు మాత్రం పుతిన్ ఆ పదవి నుంచి తప్పుకోబోరనే అభిప్రాయపడుతున్నారు. 
 
తాను బతికున్నంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగాలన్న ఆకాంక్ష పుతిన్‌కు ఉంది. ఈ మేరకు రాజ్యాంగంలో సవరణలు కూడా తీసుకువచ్చారు. అంతగా ఆ పదవిపై ఆశ ఉన్న పుతిన్ వ్యాధి కారణంగా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటారా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments