Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్మేనియన్, అజర్‌బైజాన్‌ దళాల మధ్య భీకర ఘర్షణ.. 23 మంది మృతి

Advertiesment
ఆర్మేనియన్, అజర్‌బైజాన్‌ దళాల మధ్య భీకర ఘర్షణ.. 23 మంది మృతి
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (15:05 IST)
Armenia-Azerbaijan
ఆర్మేనియన్, అజర్‌బైజాన్‌ దళాల మధ్య భీకరమైన ఘర్షణ చోటుచేసుకుంది. నాగోర్నో-కరాబాఖ్ ప్రత్యేక ప్రాంతం కోసం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందగా, 100 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. 
 
ఈ ఘర్షణలో 16 మంది అర్మేనియన్ వేర్పాటువాదులు హతమయ్యారు. వందమందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరువైపులా కూడా ప్రాణ నష్టం జరిగిందని తెలిపింది. ఒక అర్మేనియన్ మహిళ, ఒక చిన్నారి మృతి చెందినట్లు వెల్లడించింది.
 
అర్మేనియన్ వేర్పాటువాదులు ప్రయోగించిన షెల్లింగ్ దాడిలో అజర్‌బైజాన్‌‌కు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. వివాదాస్పదంగా ఉన్న నాగోర్నో-కరాబాఖ్‌లో ఇంతకుముందు కూడా అజర్‌బైజాన్‌, అర్మేనియ బలగాల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది.
 
వివాదాస్పద ప్రాంతం కోసం ఓ వైపు అజర్ బైజాన్, మరోవైపు అర్మేనియా తీవ్రమైన పోరాటం చేస్తున్నాయి. పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. దీంతో ఇరువైపుల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. అయినా, తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు ఆఫీసు సౌకర్యాలు : సుందర్ పిచాయ్