Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‌కు విషం పార్శిల్‌.. వైట్‌ హౌస్‌ లో కలకలం

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:55 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారిక నివాసమైన వైట్ హౌస్ కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన ఓ పార్శిల్‌ను పంపించారు. దీన్ని తనిఖీ కేంద్రంలోనే గుర్తించిన అధికారులు అక్కడే నిలిపివేశారు. ప్రాథమిక నిర్థారణ పరీక్షల్లో అది రిసిన్‌ అనే విష పదార్థం అని తేలినట్లు సమాచారం.

దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అనుమానిత కవర్‌ ఒకటి ట్రంప్‌ పేరిట వచ్చిందని.. దానిపై దర్యాప్తు కొనసాగుతుందని మాత్రం దర్యాప్తు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ), సీక్రెట్‌ సర్వీస్‌, యూఎస్‌ పోస్టల్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వీస్‌ కలిపి సంయుక్తంగా దీనిపై విచారణ జరుపుతున్నాయి.

గతంలోనూ ఈ తరహాలో శ్వేతసౌధం చిరునామాతో లేఖలు వచ్చాయి. 2018లో మాజీ నేవీ అధికారి ఒకరు రిసిన్‌ తో కూడిన ఓ లేఖను ట్రంప్‌నకు పంపారు. దీన్ని ముందుగానే గుర్తించి నిందితుణ్ని అరెస్టు చేశారు. 2014 లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు మిస్సిసిపీ కి చెందిన ఓ అధికారి రిసిన్‌ తో రుద్దిన లేఖను పంపారు.

అధికారులు దాన్ని ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు తీర్పు వెలువరించింది. ఇలా పలువురు ఫెడరల్‌ అధికారులకు కూడా గతంలో విషంతో కూడిన లేఖలు వచ్చాయి.

రిసిన్‌ ఆముదపు గింజల్లో సహజంగా నిక్షిప్తమై ఉంటుంది. కొన్ని రసాయనిక ప్రక్రియల ద్వారా దీన్ని గింజల నుండి వెలికితీస్తారు. సాధారణంగా ఆముదపు గింజల్ని శుద్ధి చేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాల నుండి రిసిన్‌ ను తయారు చేస్తారు.

దీనికి ఎక్స్‌పోజ్‌ అయిన 36 నుంచి 72 గంటల్లో మనిషి ప్రాణాలు కోల్పోతాడు. ఇప్పటి వరకు దీనికి విరుగుడు మందు లేకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments