Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెచ్-1బీ వీసాల రద్దు యోచనలో ట్రంప్?

Advertiesment
హెచ్-1బీ వీసాల రద్దు యోచనలో ట్రంప్?
, శుక్రవారం, 12 జూన్ 2020 (19:33 IST)
అమెరికాలో హెచ్-1బీ సహావిదేశీయులకు లభించే పలురకాల వీసాలను రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

'ది వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లక్షలాది మంది ఉపాధిని కోల్పోగా, ఈ దశలో విదేశాల నుంచి వచ్చే వారికి ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతిస్తే, వ్యతిరేకత పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నట్టు సమాచారం.
 
వీసాల రద్దుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం కాగా, ఆర్థిక సంవత్సరం మొదలయ్యే అక్టోబర్ 1 లోగా తుది నిర్ణయం వెలువడుతుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపినట్టు పత్రిక వెల్లడించింది.

"సస్పెన్షన్ ను ఎత్తివేసేంత వరకూ హెచ్-1బీ వీసాలను జారీ చేయరాదని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే వీసాలను పొంది, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదు" అని ఆ అధికారి పేర్కొన్నారని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' పేర్కొంది.
 
ఈ నిర్ణయం అత్యధికంగా భారత సాఫ్ట్ వేర్ నిపుణులపైనే పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం వీసాల రద్దు నిర్ణయాన్ని అమలు చేస్తే, అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను వదిలేసి స్వదేశానికి రావాల్సి వుంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో వైట్ హౌస్ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం జీఎంఆర్‌ ఒప్పందం