Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ - రష్యా దేశాల ప్రతినిధుల మధ్య మూడో దఫా చర్చలు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (12:02 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రకటించిన 12 రోజులకు చేరుకుంది. ఈ 12 రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా సైనకల బలగాలు బాంబులతో పాటు క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఉక్రెయిన్‌లో అపారమైన ఆస్తుల నష్టం వాటిల్లింది. ముఖ్యంగా, కీలక నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది. అణు విద్యుత్ కేంద్రాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఎయిర్ పోర్టులను పూర్తిగా ధ్వంసం చేస్తుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి పరిష్కార మార్గం కనుగొనేందుకు వీలుగా ఇప్పటివరకు రెండు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ ఎలాంటి ఫలితం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం మూడో దశ చర్చలకు పూనుకున్నారు. 
 
ఇదిలావుంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉక్రెయిన్ ప్రధాని జెలెన్ స్కీతో ఫోనులో మాట్లాడనున్నారు. అలాగే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ ఆయన మాట్లాడనున్నారు. 
 
విన్నిట్సియా ఎయిర్‌పోర్టు ధ్వంసం 
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా భీకర పోరు సాగిస్తుంది. ముఖ్యంగా, ఉక్రెయిన్ దేశంలోని ఆస్తుల ధ్వంసమే లక్ష్యంగా ఈ యుద్ధం సాగుతోంది. దీంతో ఉక్రెయిన్‌లోని అనేక ప్రైవేటు, ప్రభుత్వ భవనాలు నేలమట్టమవుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన విన్నిట్సియాపై బాంబుల వర్షం కురిపించింది. 
 
దీంతో ఆ విమానాశ్రయం పూర్తిగా దెబ్బతిన్నది. రష్యా సైన్యం ఎనిమిది రాకెట్లతో ఈ విమానాశ్రయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ వెల్లడించారు. బాంబుల మోతతో ధ్వంసమైన విమానాశ్రయం నుంచి దట్టమైన పొగలు కమ్ముకొస్తున్న వీడియో వైరల్ అయింది.
 
ప్రపంచ దేశాల ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో జెలెన్ స్కీ మరోమారు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. విమానాశ్రాయాలను కూడా వదలిపెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రష్యా నుంచి తమ దేశాన్ని రక్షించేందుకు ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ప్రకటించాలని ప్రతి రోజూ అభ్యర్థిస్తున్నామని, ఒకవేళ అలా ప్రకటించే ధైర్యం లేకుంటే కనీసం ఆయుధాలైనా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments