Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

పుతిన్‌ను చంపేయండి, ఆ పని మీరు మాత్రమే చేయగలరు: యూఎస్ సెనేటర్ షాకింగ్ కామెంట్స్

Advertiesment
Russia Ukraine war
, శుక్రవారం, 4 మార్చి 2022 (14:50 IST)
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది సైనికులు, పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపధ్యంలో యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఫాక్స్ న్యూస్‌ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది ప్రత్యక్ష ప్రసారం అవడంతో ఈ ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అయ్యింది.

 
ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.... రష్యాలో ఎవరైనా ముందుకు వచ్చి పుతిన్‌ను హత్య చేసేయాలి. రష్యన్ ప్రజలు మాత్రమే ఈ పనిని చేసి సమస్యను పరిష్కరించగలరని సెనేటర్ పునరుద్ఘాటించారు. లైవ్ ఇంటర్వ్యూలో హత్యకు పిలుపు ఇవ్వడంతో అది వైరల్ అవుతోంది.

 
గ్రాహం తను చేసిన వ్యాఖ్యల గురించి చెప్తూ... హత్య చేయమంటూ చెప్పడం చాలా సులభం, చేయడం కష్టం. రష్యన్లకు నా సలహా ఏంటంటే... మీరు మీ జీవితాంతం చీకటిలో జీవించాలనుకుంటే, దుర్భరమైన పేదరికంలో మగ్గిపోతూ మిగిలిన ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఒంటరిగా ఉండాలంటే పుతిన్‌ను అలాగే సమర్థిస్తూ వుండండి. లేదంటే అతడిని తొలగించండి అంటూ ట్విట్టర్‌లో రాశారు.

 
మరోవైపు ఉక్రెయిన్ లోని న్యూక్లియర్ ప్లాంట్‌ పైన రష్యా దళాలు దాడి చేయడంతో అక్కడ భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఈ రియాక్టర్ కనుక విస్ఫోటనం చెందితే యూరప్ దేశాలు సర్వనాశనం అవుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేసారు. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా రష్యాను నిలువరించాలంటూ ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు రాజకీయంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక : మంత్రి సబిత