Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యుద్ధం భయం, రష్యన్లు అలా దేశం విడిచి వెళ్లకుండా పుతిన్ డిక్లరేషన్, ఏంటది?

యుద్ధం భయం, రష్యన్లు అలా దేశం విడిచి వెళ్లకుండా పుతిన్ డిక్లరేషన్, ఏంటది?
, బుధవారం, 2 మార్చి 2022 (11:42 IST)
రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలతో త్వరలో రష్యా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం. ఈ నేపధ్యంలో రష్యాలోని పౌరులు పొరుగు దేశాలకు వెళ్లిపోతారన్న ఆందోళనలో పుతిన్ సర్కార్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో 10 వేల డాలర్లకు మించి విదేశీ కరెన్సీతో రష్యన్లు దేశం విడిచి వెళ్లరాదంటూ పుతిన్ డిక్రీపై సంతకం చేసారు.

 
రష్యా మీడియా వెలువరించిన వివరాల ప్రకారం, $10,000 కంటే ఎక్కువ విదేశీ కరెన్సీతో రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిక్రీపై సంతకం చేశారు. క్రెమ్లిన్ ప్రెస్ ఆఫీస్ నుండి వెలువడిన ఈ ప్రకటన ప్రకారం, ఈ చర్య "రష్యా ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించే" ప్రయత్నం.

 
ఉక్రెయిన్‌పై గత వారం నుంచి దండయాత్ర ప్రారంభమైన నేపధ్యంలో పాశ్చాత్య దేశాల ఆంక్షలు రష్యన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే అవకాశం వుంది. దీనితో ముందుజాగ్రత్త చర్యగా పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు విడతల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ మెయిన్స్ ప్రవేశ పరీక్షలు