దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో వున్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా, భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
ముఖేష్ అంబానీ తన సతీమణితో కలిసి హాజరయ్యారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా పాల్గొన్నారు. ఈ విందు కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అమెరికాలో బేస్‌బాల్‌కు ఆదరణ లభిస్తుండగా, క్రికెట్ కూడా ప్రాచుర్యం పొందుతోంది.
భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొనే ప్రయత్నంలో అమెరికా క్రికెట్ జట్టు క్వాలిఫయర్స్‌లో ఆడుతోంది. అలాంటి క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుకుంటున్నానని ప్రధాని ఆకాంక్షించారు.
భారతీయ-అమెరికన్లు ఒకరినొకరు బాగా తెలుసుకుంటున్నారు. భారతీయ పిల్లలు స్పైడర్ మ్యాన్ వేషధారణతో హాలోవీన్ జరుపుకుంటారు.
దేశీయ పాట నాటు నాటు పాటకు యువత డ్యాన్స్ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
ఈ పార్టీని నిర్వహించినందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కి ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.