Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం - 13 మంది సజీవదహనం

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (13:45 IST)
అమెరికాలో దారుణం జరిగింది. ఏకంగా 13 మంది సజీవదహనమయ్యారు. ఈ దేశంలోని ఫిలడెల్ఫియాలోని ఒక మూడంతస్తుల అపార్టుమెంట్‌లో మంటలు చెలరేగడంతో ఈ ఘోరం జరిగింది. 
 
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.40 గంటల సమయంలో ఈ మంటలు చెలరేగాయి. దీంతో ఏడుగురు చిన్నారులతో సహా మొత్తం 13 మంది మృత్యువాతపడ్డారు. మరో ఎనిమిది మందిని  పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఆ తర్వాత మంటల్లో కాలిపోయిన మృతదేహాలను వెలికి తీశారు. 
 
దీనిపై అగ్నిమాపకదళ అధికారులు స్పందిస్తూ, భవనంలోని రెండో అంతస్తులో నుంచి మంటలు చెలరేగాయిని, ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో 13 మంది చనిపోయారని తెలిపారు. అయితే, ప్రాణాలతో బయటపడిన ఎనిమిది మందిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా, ఈ మూడు అంతస్తుల భవనంలో మొత్తం 26 మంది నివసం ఉంటూ వచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments