Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారుల కోసం మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవాడ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Advertiesment
చిన్నారుల కోసం మణిపాల్‌ హాస్పిటల్స్‌ విజయవాడ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌
, బుధవారం, 5 జనవరి 2022 (19:00 IST)
భారతదేశంలో 15-18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఇండియా ప్రారంభించింది. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కోవాగ్జిన్‌ టీకాను ఈ వయసు పిల్లలకు అందించేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికనుగుణంగా మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ ఇప్పుడు పీడియాట్రిక్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులకు మొదటి డోసు వ్యాక్సిన్‌లను పిల్లలకు అందించింది.

 
రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలన్నీ మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ అనుసరించడంతో పాటుగా ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని హాస్పిటల్‌లో ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంగణం వద్ద నిర్వహిస్తున్నారు. ఇక్కడ వాక్సిన్‌ ఆఫీసర్స్‌, నర్సులు, డాక్టర్లు వంటి వారు ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అందుబాటులో ఉండనున్నారు.

 
వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించడం గురించి నియోనాటాలజిస్ట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ పీ రవి కుమార్‌ మాట్లాడుతూ, ‘‘ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడి వైద్యులు, నర్సులు ఉదారంగా వ్యవహరించడంతో పాటుగా ఈ ప్రక్రియ అంతటా వారికి మార్గనిర్ధేశకత్వం చేస్తుండటం వల్ల పిల్లలు తమంతట తాము సౌకర్యవంతంగా ఉండగలుగుతున్నారు. కోవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌ సమయంలో మనమంతా తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నాం. చిన్నారులకూ ఇది ఏమంత విభిన్నంగా లేదు. అందువల్ల, కోవిడ్‌-19కు వ్యతిరేకంగా పిల్లలందరికీ వ్యాక్సిన్‌లను అందించడం అత్యంత కీలకం’’అని అన్నారు.

 
కన్సల్టెంట్‌ పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ ఉదయ్‌ కిరణ్‌ బేతపూడి మాట్లాడుతూ, ‘‘డెల్టా వేరియంట్‌ సహా నూతన  వేరియంట్‌ ఒమిక్రాన్‌, కోవిడ్‌ అనంతర సమస్యల నుంచి పిల్లలను సురక్షితంగా ఉంచడంలో అత్యుత్తమ మార్గం కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ అందించడం. చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్‌ను అందిస్తామనే భరోసానందిస్తూ మణిపాల్‌ హాస్పిటల్స్‌ ఇప్పుడు స్లాట్స్‌ అందిస్తుంది’’ అని అన్నారు.

 
డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి, హాస్పిటల్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ, ‘‘చిన్నారులతో పాటుగా యువతపై కూడా తీవ్ర ప్రభావాన్ని కోవిడ్‌ 19 మహమ్మారి కలిగించింది. వీరు కోలుకోవడంలో అత్యంత కీలకమైన ముందడుగుగా ఇమ్యునైజేషన్‌ ప్రక్రియ నిలుస్తుంది. అది దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఇప్పుడు 15-18 సంవత్సరాల పిల్లలకు సైతం వ్యాక్సినేషన్‌ అందించడం కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం మహోన్నతమైనది. కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు టీనేజర్లకు వ్యాక్సిన్‌లను అందించడం కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని  ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా అభ్యర్ధిస్తున్నాను’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేయ వ్యాధికి దారితీసే కొవ్వు ఎలా చేరుతుందో తెలుసా?