Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభినందన్‌ వర్ధమాన్‌.. యుద్ధ విమానాన్ని కూల్చలేదు.. పాకిస్థాన్

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (14:47 IST)
పుల్వామా దాడిలో 40 మందికి పైగా జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్‌ ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్‌ బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిపిన సంగతి విదితమే. బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం జరిగిన వైమానిక దాడిలో భారత వైమానికి దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌.. తమ యుద్ధ విమానాన్ని ఎఫ్‌ 16 కూల్చివేశాడని పేర్కొనడంపై పాకిస్థాన్ స్పందించింది. 
 
2019లో జరిగిన వైమానిక దాడిలో తమ యుద్ధ విమానాన్ని కూల్చివేశారన్న భారత్ వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. దుందుడుకు చర్యలకు పాల్పడాలని చూసిన భారత పైలట్‌ను ఆరోజు విడుదల చేయడం.. శాంతికాముక దేశంగా పాకిస్థాన్‌ వైఖరికి నిదర్శనం' అని ఆ దేశ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. 
 
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడి ఘటన సందర్భంగా అభినందన్ నడుపుతున్న మిగ్‌- 21 యుద్ధవిమానం.. పాకిస్థాన్‌లో కూలింది. అనంతరం వర్ధమాన్‌ను నిర్బంధంలోకి తీసుకున్న పాక్‌ మార్చి 1న ఆయన్ను భారత్‌కు అప్పగించింది.
 
ఆ సమయంలో చూపించిన ధైర్యసాహాసాలకు గాను సోమవారం వర్థమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 'వీర్‌ చక్ర'ను ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం దీనిపై పాక్‌ స్పందించింది. వర్ధమాన్‌ తమ విమానాన్ని కూల్చివేయలేదని పేర్కొంది. 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments