Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్ అంతర్జాతీయ వివాదమన్న పాక్ ప్రధాని ఇమ్రాన్... అమిత్ షా అణుబాంబు వేశారన్న ఆజాద్

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (16:14 IST)
జమ్ము-కశ్మీర్ పైన హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయంపైన పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కశ్మీర్ అనేది అంతర్జాతీయ సమస్య అనీ, దీనిపై ఇండియా తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. రాజకీయంగానూ, దౌత్యపరంగా తాము ముందడుగు వేసేందుకు అనువైన మార్గాలను చూస్తున్నట్లు తెలిపారు.
 
కశ్మీర్ అంతర్జాతీయ వివాదంలో తాము కూడా భాగస్వాములుగా వున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు కశ్మీరీల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీరీలు, పాకిస్థానీయులు ఆమోదించరంటూ తెలిపింది.
 
కశ్మీర్ పైన అమిత్ షా అణుబాంబు వేశారన్న ఆజాద్
కాశ్మీర్‌లో ముగ్గురు ప్రముఖ రాజకీయనేతలను గృహ నిర్బంధంలో ఉంచడం, శ్రీనగర్‌లో 144 సెక్షన్ అమల్లోకి తేవడంతో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నిప్పులు చెరిగారు. కాశ్మీర్‌ పైన అమిత్ షా అణుబాంబు వేశారనీ, అసలు ఆ ప్రాంతాన్ని ఏంచేయదలచుకున్నారు? అని ప్రశ్నించారు. 
 
సోమవారంనాడు పార్లమెంటు వద్ద ఆజాద్ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. పార్లమెంటులో కాశ్మీర్‌ అంశాన్ని తమ పార్టీ ఇవాళ లేవెనత్తుతుందని, ప్రధాని మోదీ నుంచి వివరణ కోరుతామని చెప్పారు.
 
కాగా.. కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేస్తూ.. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు‌. 35ఎ కూడా రద్దుకు కూడా అమిత్ షా ప్రకటన చేశారు. 370 రద్దుతో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోనుంది. 35ఏ రద్దుతో కాశ్మీర్ ప్రత్యేక సౌకర్యాలను కోల్పోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments