Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె ఆ పని చేసిందనీ.. 8 మందిని సజీవదహనం చేసిన తండ్రి

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:32 IST)
పాకిస్థాన్ దేశంలో దారుణం జరిగింది. తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కన్నతండ్రి ఏకంగా ఎనిమిది మందిని సజీవ దహనం చేశాడు. ముఖ్యంగా, తాను చూపించిన యువకుడిని కూతురు పెళ్లి చేసుకోక పోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముజఫర్‌గఢ్ జిల్లాకు చెందిన మంజూర్ హుస్సేన్‌కు ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడున్నారు. 2020లో చిన్న కూతురైన ఫౌజియా బీబీ.. మహబూబ్ అహ్మద్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. 
 
వారికి ఓ అబ్బాయి పుట్టాడు. ఆ పెళ్లి ఇష్టం లేని మంజూర్.. ఎప్పుడూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే ముజఫర్‌గఢ్‌లోనే ఉంటున్న తన ఇద్దరు కూతుళ్ల ఇళ్లకు తన కొడుకు సాబిర్ హుస్సేన్‌తో కలిసి నిప్పు పెట్టాడు.
 
ఆ మంటల్లో బీబీ, ఆమె నెలల కుమారుడు, పెద్ద కూతురు ఖుర్షీద్ మాయి, ఆమె భర్త, నలుగురు చిన్నారులు ఆహుతైపోయారు. పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లిన బీబీ భర్త మహబూబ్ అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. 
 
అయితే, ఈ దారుణం జరిగిన రోజే అతడు ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికే రెండు ఇళ్లూ మంట్లలో కాలిపోతుండడాన్ని గమనించిన అతడు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ ఘటనపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఆ సమయంలో మంజూర్, సాబిర్ లను తాను అక్కడే చూశానని, వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments