Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో తారాస్థాయికి చేరిన ఆర్థిక సంక్షోభం.. లీటరు పెట్రోల్‌పై రూ.35 వడ్డన

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (10:36 IST)
పాకిస్థాన్ దేశంలో ఆర్థిక సంక్షోభం తారా స్థాయికి చేరింది. ఇప్పటికే ఆహార సంక్షోభంతో పాక్ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఆర్థిక సంక్షోభం కూడా తలెత్తింది. దీంతో పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయింది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్ పాలకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, తాజాగా లీటరు పెట్రోల్‌పై ఏకంగా 35 రూపాయల ధరను (భారత కరెన్సీలో రూ.11.80 పైసలు) పెంచేశారు. ఫలితంగా ప్రస్తుతం పాక్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.249.80 పైసలకు చేరింది. 
 
ఇదే అంశంపై పాకిస్థాన్ ఆర్థిక శాఖామంత్రి ఇషాక్ ధార్ ఓ ప్రకటన చేశారు. "పెట్రోల్ డీజిల్‌పై లీటరుకు రూ.35 చొప్పున పెంచాలని నిర్ణయించాం. కిరోసిన్, లైట్ డీజిల్ ధర‌లను లీటరుకు రూ.18 చొప్పున పెంచుతున్నాం" అని పేర్కొన్నారు. ఈ పెంచిన ధరలు కూడా ఆదివారం ఉదయం 11 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
తాజాగా పెంచిన ధరతో కలుపుకుంటే లీటరు పెట్రోల్ ధర రూ.249.80, హైస్పీడ్ పెట్రోల్ లీటరు ధర రూ.262.80, కిరోసిన్ ధర రూ.189.83, లైట్ డీజల్ ధర రూ.187కు చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, డాలరు విలువతో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ తీవ్రస్థాయిలో పతనమైపోతోంది. దీంతో పెట్రోల్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments