Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్జీలు తగ్గించాలంటూ తాలిబన్ల హుకుం .. నిలిచిన పాక్ ఫ్లైట్ సర్వీసులు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:37 IST)
తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్ దేశ రాజధాని కాబూల్‌కు పాకిస్థాన్ ప్రభుత్వం నడుపుతూ వచ్చిన విమాన సేవలను నిలిపివేసింది. విమాన చార్జీలను తగ్గించాలని లేనిపక్షంలో నిలిపివేస్తామని తాలిబన్ పాలకులు పాకిస్థాన్‌ను హెచ్చరించారు. దీంతో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఊహించని నిర్ణయం తీసుకుంది. కాబూల్‌కు నడుపుతున్న అన్ని రకాల విమాన సర్వీసులను నిలిపివేసింది. 
 
టికెట్ ధరలను తగ్గించాలని, లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆఫ్ఘన్‌లోని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి ముందు అంటే ఆగస్టు 15 వరకు కాబూల్ - ఇస్లామాబాద్ మధ్య టికెట్ ధర 120-150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడది 2500 డాలర్లుగా ఉంది.
 
ఈ నేపథ్యంలో మునుపటి ధరలతో విమాన సర్వీసులను నడపాలని తాలిబన్లు ఆదేశించారు. టికెట్ ధరలను తగ్గించలేని పీఐఏ విమాన సర్వీసులను రద్దు చేసింది. తాము మానవతా దృక్పథంతోనే విమాన సర్వీసులు నడుపుతున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. 
 
బీమా సంస్థలు కాబూల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, అందుకనే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. మరోవైపు, తమ సిబ్బందిని తాలిబన్లు భయపెడుతున్నారని పీఐఏ ఆరోపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అగ్రహీరోలపై సెన్సేషనల్ కామెంట్ చేసిన తాప్సీ పన్ను

డబ్బుకోసం ఏదైనా చేసే రేసర్ గా నిఖిల్ సిద్ధార్థ్‌ ఏం చేశాడు?

యాక్షన్ సన్నివేశంలో గాయపడ్డా షూట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ

సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ 'జీబ్రా' ఫస్ట్ సింగిల్ రిలీజ్

సాయి దుర్గ తేజ్18లో వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments