Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ వ్యాపారికి ఘోర అవమానం.. గుండు గీసి.. కనుబొమలు తొలగించి...

పొరుగుదేశం పాకిస్థాన్‌లో హిందువులపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ దేశంలో హిందువులు మైనార్టీలుగా జీవిస్తున్న విషయం తెల్సిందే. దీంతో వారిపై దాడులు ఎక్కువై పోతున్నాయి.

Webdunia
గురువారం, 10 మే 2018 (12:23 IST)
పొరుగుదేశం పాకిస్థాన్‌లో హిందువులపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ దేశంలో హిందువులు మైనార్టీలుగా జీవిస్తున్న విషయం తెల్సిందే. దీంతో వారిపై దాడులు ఎక్కువై పోతున్నాయి. కేవలం ఒక్క హిందువులపైనే కాకుండా, అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్న ప్రజలపై పాకిస్థాన్‌లో దాడులు జరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారత్‌కు వెళ్లకుండా పాకిస్థాన్‌లో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన చున్నీలాల్ అనే వ్యాపారికి తాజాగా తీరని అవమానం ఎదురైంది. ఈ అవమానం సింధ్ ప్రాంతంలో జరిగింది.
 
ఈ ప్రాంతానికి చెందిన చున్నీలాల్ అనే హిందువు వడ్డీ వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఆయన అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చాడని ఫిర్యాదులు రావడంతో స్థానిక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని శిరోముండనం చేయడంతోపాటు, మీసాలు, కనుబొమలు తొలగించారు. 
 
ఈ విషయమై పాక్‌కు చెందిన మానవహక్కుల సంఘం కార్యకర్త కపిల్‌దేవ్ ట్వీట్ చేస్తూ శికార్‌పూర్ పోలీసులు వడ్డీకి డబ్బులిచ్చిన హిందూ వ్యాపారి చున్నీలాల్‌కు శిరోముండనం చేయడంతోపాటు అతని మీసాలు, కనుబొమలు తొలగించారని ఆవేదన చెందారు.
 
చున్నీలాల్ అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. కాగా పాక్‌లో హిందువుల జనాభా కేవలం 4 శాతం ఉన్న నేపధ్యంలో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని విచారం వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments