Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్జికల్ స్ట్రైక్స్ జరగనేలేదు.. భారత్ మాత్రం పాడిందే పాడుతోంది: పాకిస్థాన్

భారత్ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని చెప్తోంది. కానీ భారత్ మాత్రం అరిగిపోయిన రికార్డులా అదే పాట పదేపదే పాడుతుందని పాకిస్థాన్ మండిపడింది. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఓ కా

Advertiesment
సర్జికల్ స్ట్రైక్స్ జరగనేలేదు.. భారత్ మాత్రం పాడిందే పాడుతోంది: పాకిస్థాన్
, శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (11:01 IST)
భారత్ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని చెప్తోంది. కానీ భారత్ మాత్రం అరిగిపోయిన రికార్డులా అదే పాట పదేపదే పాడుతుందని పాకిస్థాన్ మండిపడింది. బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత భద్రతా దళాలు పాకిస్థాన్‌లో విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయని.. ఈ విషయాన్ని ముందు పాకిస్థాన్‌కే చెప్పామని.. తర్వాతే భారత మీడియాకు తెలిపామని మోదీ అన్నారు. అంతేగాకుండా పాకిస్థాన్ ఉగ్రవాదుల ఎగుమతి చేస్తోందని ఆరోపించారు.
 
అయితే మోదీ వ్యాఖ్యలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమ దేశంపై అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని పేర్కొంది. భారత్ మాటలు బూటకమని కొట్టిపడేసింది. జరగని విషయాన్ని జరిగినట్లు భారత్ పదేపదే చెప్తోందని విమర్శలు గుప్పించింది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని భారత్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని.. ఆధారాలు లేకుండా భారత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. 
 
ఇదిలా ఉంటే.. గత డిసెంబర్‌‌లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ అధీనంలో ఉన్న నగరాలను హస్తగతం చేసుకున్న తరువాత, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇరాక్ న్యాయస్థానాలు పలువురికి కఠిన శిక్షలు విధిస్తున్నాయి. ఐఎస్ఐఎస్‌లో చేరి, ఉగ్రవాదులుగా మారిన వారితో పాటు, వారి కార్యకలాపాలకు సహకరించిన వారందర్నీ ఇరాక్ లోని సంకీర్ణ సేనలు అదుపులోకి తీసుకోగా, వారిలో సుమారు 300 మందికి న్యాయస్థానాలు మరణశిక్షను ఖరారు చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరు దశాబ్దాల క్యాస్ట్రో కుటుంబ పాలనకు చరమగీతం...