Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజర్ మసూద్ ఆస్తులు ఫ్రీజ్ చేయండి : పాకిస్థాన్ నోటిఫికేషన్

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:28 IST)
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన లష్కర్ ఏ తోయిబా అధినేత మసూద్ అజర్‌పై చర్యలకు పాకిస్థాన్ ఉపక్రమించింది. పలు దేశాలకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ముద్రపడిన మసూద్ అజర్, అంతర్జాతీయ ఉగ్రవాదేనని ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెల్సిందే. దీనికి చైనా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 
 
దీంతో పాకిస్థాన్ చర్యలకు దిగింది. ఇందులోభాగంగా, మసూద్ ఆస్తులను జప్తు చేయాలని, ఆయన ఎటువంటి ఆయుధాల కొనుగోలు, అమ్మకాలు జరపరాదని ఆంక్షలు విధిస్తూ, అధికారిక నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. ఆంక్షల కమిటీ విధించే నిబంధనలకు అనుగుణంగా మసూద్‌‌పై చర్యలు ఉంటాయని ఈ నోటిఫికేషన్‌లో పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. 
 
మసూద్ విదేశీ ప్రయాణాలపైనా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. భద్రతా మండలి నిర్ణయాన్ని తాము ఆమోదిస్తున్నామని, నిబంధనల మేరకు ఆంక్షలను తక్షణమే అమలు చేయనున్నామని పేర్కొంది.
 
కాగా, మసూద్‌ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాల్సిందేనంటూ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాలు భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆపై చైనా కూడా అభ్యంతరం తెలపకపోవడంతో రెండు రోజుల క్రితం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments