Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటాఏస్‌ ఆటో బీభత్సం.. మైనర్ బాలుడు నడిపాడు.. అంతే జనాల్లోకి దూసుకొచ్చి?

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:11 IST)
వారాసిగూడలో చౌరస్తాలో టాటాఏస్‌ ఆటో బీభత్సం సృష్టించింది. ఏకంగా జనాల్లోకి దూసుకెళ్లింది. పొరపాటున ఓ బాలుడు వాహనం నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు గుర్తించారు.


ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గురువారం వారాసిగూడ చౌరస్తాలో ఉర్సు ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది. ఈ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఓ టాటాఏస్‌ వాహనాన్ని ఓ పక్కన పెట్టి డ్రైవర్‌ ఊరేగింపులో పాల్గొంటున్నాడు. దీంతో అక్కడే ఉన్న ఓ మైనర్ బాలుడు వాహనం నడపాలని బండి రేజ్‌ చేయడంతో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి జనాల మీదకు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ రాని బాలుడు వేగంగా వాహానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. 
 
ఈ ప్రమాదంలో కొమరయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో బాలుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments