Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో మారణహోమం - చర్చిలోని భక్తులపై కాల్పులు - 50 మృతి

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:31 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైనా నైజీరియాలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఆదివారం చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న భక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు తెగబడ్డారు. బాంబులు విసిరారు. దీంతో 50 మందికి వరకు మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం గమనార్హం. ఆ తర్వాత చర్చి ఫాస్టర్‌ను కిడ్నాప్ చేశారు. ఈ మారణహోమం ఓండో రాష్ట్రంలోని సెయిట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో జరిగింది. 
 
ఆదివారం కావడంతో ఈ చర్చిలో ప్రార్థనలు చేసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. ఫాస్టర్‌ను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. చర్చిపై బాంబులతో దాడి చేసి మరోవైపు కాల్పులు జరిాపరు. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిన అవయవాలతో చర్చి భీతావహంగా మారింది. ఈ దాడిలో ఎంత మంది మరణించారన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు. కానీ, దాదాపు 50 మంది వరకు చనిపోయినట్టు మీడియా కథనాల సమాచారం. 
 
ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన పిశాచాలు మాత్రం గర్భందాల్చి ఇటువంటి మారణహోమాన్ని సృష్టించగలవని అన్నారు. ఏది ఏమైనా ఈ దేశం ఎన్నటికీ దుష్టులకు తలొగ్గదన్నారు. చీకటి ఎప్పటికీ వెలుగునివ్వలేదన్నారు. చివరికి నైజీరియా గెలుస్తుందని బుహారీ పేర్కొన్నారు. అయితే, ఈ మారణహోమానికి ఏ ఒక్క సంస్థ నైతిక బాధ్యత వహించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments